News3rd May 11:53 AMSunil Byrisetty1 min read
రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం
ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం కార్యక్రమం పూర్తి కావడంతో పనులు వేగవంతమవుతున్నాయి. కూటమి సర్కార్ రాజధాని పనులు శరవేగంగా చేపడుతోంది. మరోవైపు ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేస
ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం కార్యక్రమం పూర్తి కావడంతో పనులు వేగవంతమవుతున్నాయి.
కూటమి సర్కార్ రాజధాని పనులు శరవేగంగా చేపడుతోంది.
మరోవైపు ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరుపుతున్నారు.
సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హై కోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు.
ఆయా భవనాల డిజైన్లను మంత్రి, అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు వివరిస్తున్నారు.