News3rd Apr 09:23 AMSunil Byrisetty1 min read

చంపొద్దు.. శాంతి చర్చలకు సిద్ధమన్న మావోలు!

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతోంది. మావోయిస్టులు కనబడితే చాలు భద్రతా బలగాలు ’మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్‘ అంటూ తూటాల వర్షం కుర

చంపొద్దు.. శాంతి చర్చలకు సిద్ధమన్న మావోలు!
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతోంది. మావోయిస్టులు కనబడితే చాలు భద్రతా బలగాలు ’మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్‘ అంటూ తూటాల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి 6కు తగ్గినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అత్యాధునిక డ్రోన్లు, సాంకేతికతను ఉపయోగించి మావోలు ఏ కలుగులో దాక్కున్నా వెంటాడి వేటాడుతున్నారు. దీంతో గత కొన్ని నెలల్లో మావోలు పెద్ద సంఖ్యలో తమ వారిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజాస్వామ్యవాదులు, మీడియా సమక్షంలో శాంతి చర్చలు జరపాలని కోరారు.
Maoists letter
operation kagar
కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మావోయిస్టు
Scroll for the next article