News29th Nov 02:24 PMSunil Byrisetty1 min read
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందన్నారు. మొదటి దశలో 25 గ్
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందన్నారు. మొదటి దశలో 25 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇది కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకునే 54 వేల ఎకరాలు ఉందని అన్నారు. 11 ఏళ్లుగా అమరావతికి రూపు లేదని, ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలేనని విమర్శించారు. 217 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదన్నారు. మొత్తం అభివృద్ధి జరిగి విశ్వనగరం అయినట్లు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. రెండో విడత భూములు 16 వేల ఎకరాలు ఇప్పుడు ఎందుకని, రెండో విడతలో 44 వేల ఎకరాలు ఏం అవసరం వచ్చిందని ప్రశ్నించారు. అమరావతి రైతులను చంద్రబాబు బెదిరిస్తున్నారని, అమరావతి మున్సిపల్ సిటీగా కావాలా.. గ్లోబల్ సిటీగా కావాలని అడగడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. మొదటి విడతలో 54 వేల ఎకరాలు సేకరించినప్పుడు చంద్రబాబుకు అమరావతి మున్సిపాలిటీ అని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు.