News24th Mar 04:49 PMSunil Byrisetty1 min read
తగ్గిన రియల్ ఎస్టేట్ డిమాండ్
దేశంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ దారుణంగా పడిపోతోంది. కరోనా తర్వాత డిమాండ్ భారీగా పెరగ్గా.. మళ్లీ కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది. దేశవ్యాప్తంగా టాప్-9 నగరాల్లో ఇళ్ల విక్రయాలు.. 2
దేశంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ దారుణంగా పడిపోతోంది.
కరోనా తర్వాత డిమాండ్ భారీగా పెరగ్గా.. మళ్లీ కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది.
దేశవ్యాప్తంగా టాప్-9 నగరాల్లో ఇళ్ల విక్రయాలు.. 23 శాతం తగ్గినట్లు ప్రాప్ఈక్విటీ సంస్థ తేల్చింది.
మరోవైపు సరఫరా కూడా 34 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి.. తాజాగా ఈ డేటా అనలిటిక్స్ సంస్థ.. రిపోర్టు విడుదల చేసింది.
దేశీయంగా ఇళ్ల ధరలు పెరగడం, రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొంత ప్రభావం పడిందని తేల్చింది.
ఇంకా భారత ఆర్థిక వ్యవస్థలోనూ అనిశ్చితి వల్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది.బెంగళూరు, ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో అమ్మకాలు తగ్గాయి.
హైదరాబాద్ విషయానికొస్తే నగరంలో అమ్మకాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 47 శాతం పడిపోయాయి.
కొత్త ఇళ్ల సరఫరా 38 శాతం తక్కువగా ఉందని తేల్చింది. ముంబైలో 36 శాతం, పుణేలో 33 శాతం, కోల్‌కతాలో 28 శాతం, థానేలో 27 శాతం, నవీ ముంబైలో 7 శాతం, చెన్నైలో 2 శాతం ఇళ్ల విక్రయాలు పడిపోయాయని ప్రాప్ఈక్విటీ పేర్కొంది.