News12th Nov 02:28 PMSunil Byrisetty1 min read

మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కల నెరవేర్చండి

‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రం మీకు సొంత

మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కల నెరవేర్చండి
‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంద’’ని వివరించారు.
Scroll for the next article