Mobiles25th Dec 04:58 PMSunil Byrisetty1 min read
కొత్త ఏడాదిలో Realme 16 Pro Plus.. ఏకంగా 200 MP కెమెరా
చైనా స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ, తమ సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Realme 16 Pro Plus ని జనవరి 6న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింద
చైనా స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ, తమ సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Realme 16 Pro Plus ని జనవరి 6న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్స్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన ఫ్లిప్ కార్ట్ తో పాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ , 200 మెగా పిక్సెల్ మెయిన్ పోర్ట్రైట్ కెమెరా , 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే నాలుగు వేరియంట్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని కూడా లీకుల ద్వారా తెలుస్తుంది. చివరగా ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 30,000 ధరకి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.