Mobiles2nd Nov 02:02 PMSunil Byrisetty1 min read
రియల్ మీ జీటీ 8 ప్రో.. ఫీచర్స్ ఏంటంటే..
చైనాలో విడుదలై ఆదరణ పొందిన రియల్ మీ జీటీ 8 ప్రో 5G ఫోన్ త్వరలో భారత మార్కెట్ లోకి రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్‌కార్ట్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట
చైనాలో విడుదలై ఆదరణ పొందిన రియల్ మీ జీటీ 8 ప్రో 5G ఫోన్ త్వరలో భారత మార్కెట్ లోకి రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్లిప్‌కార్ట్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 50MP సోనీ కెమెరా, 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. 6.79 ఇంచ్ LTPO అమోలెడ్ డిస్ ప్లే, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1440 x 3136 పిక్సల్స్ రిజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, రియల్మీ యూఐ 7 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్, వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 200 మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, సెల్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆకర్షణలుగా ఉన్నాయి.