Mobiles31st Jan 04:30 PMSunil Byrisetty1 min read

రియల్మీ నుంచి 200 MP కెమెరాతో ప్రీమియం స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన రియల్మీ, తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Realme 16 Pro ని వియాత్నం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన

రియల్మీ నుంచి 200 MP కెమెరాతో ప్రీమియం స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన రియల్మీ, తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Realme 16 Pro ని వియాత్నం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్ , 200 మెగా పిక్సెల్ మెయిన్ పోర్ట్రైట్ కెమెరా, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం వంటి అద్భుతమైన ఫీచర్లతో విడుదల అవ్వడం జరిగింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో విడుదల అవ్వడం జరిగిందని, అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ధరని 14,490,000 వియాత్నమీస్ డాంగ్ గా అనగా మన దేశంలో సుమారు రూ. 50,000 లుగా కంపెనీ నిర్ణయించింది. చివరగా ఈ స్మార్ట్ ఫోన్ ఇతర దేశాల మార్కెట్స్ లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అనే విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Realme
Realme 16 Pro
200MP Camera
Premium Smartphone
5G Mobile
MediaTek Dimensity 7300 Max
Android 16
Fast Charging
Smartphone Launch
Scroll for the next article