Mobiles23rd Jan 04:18 PMSunil Byrisetty1 min read

బాహుబలి బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్

రియల్ మీ స్మార్ట్ ఫోన్ చరిత్రను తిరగరాసే నూతన ఫోన్ ను తీసుకొచ్చింది. బాహుబలి బ్యాటరీతో కొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది. జనవరి 29న Realme P4 Power 5G Bahubali Battery స్మార్ట్ ఫోన్ న

బాహుబలి బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్
రియల్ మీ స్మార్ట్ ఫోన్ చరిత్రను తిరగరాసే నూతన ఫోన్ ను తీసుకొచ్చింది. బాహుబలి బ్యాటరీతో కొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది. జనవరి 29న Realme P4 Power 5G Bahubali Battery స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 10,001 mAh. భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్నా మొబైల్ సిలికాన్ - కార్బన్ టెక్నాలజీతో సన్నగా, తేలికగానే డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. పైగా బ్యాటరీకి నాలుగేళ్లు హెల్త్ గ్యారెంటీ ఇస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు సులభంగా ఉపయోగించుకోవచ్చని రియల్‌మీ పేర్కొంది. అలాగే 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ అవుతుంది. అదనంగా ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకునేందుకు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు.
Tech News
Realme
Realme P4 Power 5G
Bahubali Battery
10001mAh Battery
80W Fast Charging
Reverse Charging
Smartphone Launch
5G Mobile
Scroll for the next article