News17th Jul 05:10 PMSunil Byrisetty1 min read

పల్నాడు చరిత్రలో సువర్ణాధ్యాయం

పల్నాడు నేలపై సరికొత్త ప్రగతి ప్రస్థానానికి శ్రీకారం చుడుతూ నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియం వేదికగా నిర్వహించిన 'మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్' (మెగా రుణ మేళా) వి

పల్నాడు చరిత్రలో సువర్ణాధ్యాయం
పల్నాడు నేలపై సరికొత్త ప్రగతి ప్రస్థానానికి శ్రీకారం చుడుతూ నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియం వేదికగా నిర్వహించిన 'మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్' (మెగా రుణ మేళా) విజయవంతంగా ముగిసింది. పల్నాడు చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒకే వేదికపై రికార్డు స్థాయిలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ. 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు అంటే కేవలం పౌరుషాల పురిటిగడ్డ మాత్రమే కాదని, సరైన అవకాశాలు కల్పిస్తే వాటిని అందిపుచ్చుకుని ప్రగతి సాధించడంలో ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ముందంజలో ఉంటారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వెనుకబడిన పల్నాడులోని ప్రతి గ్రామానికి, ప్రతి అర్హుడికీ చేర్చాలనే సంకల్పంతోనే ఈ భారీ కార్యక్రమాన్ని నిర్మించగలిగామని స్పష్టం చేశారు.బ్యాంకులంటే డబ్బున్నవారికి సంబంధించిందనే అభిప్రాయం ఉందని, సామాన్యులకు రుణాలు రావనుకుంటారని అన్నారు. 1,03,246 మందికి రూ. 3,216 కోట్లు రుణాలుగా ఇస్తే, వారిలో 70 శాతం మంది అంటే 70 వేల మంది కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారేనని వివరించారు.
Andhra Pradesh
Palnadu
Mega Credit Outreach Programme
Loan Mela
Narasaraopet
Lavu Sri Krishna Devarayalu
Narendra Modi
బ్యాంకు రుణాలు
ఆర్థిక చేరిక
ప్రభుత్వ పథకాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article