Farmers20th Aug 12:57 PMSunil Byrisetty1 min read
సర్వేపల్లిలో హోరెత్తిన రైతు సంతోషం
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపుతో వందలాదిగా రైతు రథాలు రోడ్డెక్కాయి. 900 ట్రాక్టర్లతో సర్వేపల్లి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ విజయోత్సవం
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపుతో వందలాదిగా రైతు రథాలు రోడ్డెక్కాయి. 900 ట్రాక్టర్లతో సర్వేపల్లి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ విజయోత్సవం రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. వెంకటాచలం సమీపంలోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద నుంచి ఎర్రగుంట టోల్ ప్లాజా దగ్గరలోని కమ్యూనిటీ హాలు వరకు భారీ ర్యాలీ సాగింది. విజయోత్సవాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుండి నడిపించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా రైతులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయోత్సవంలో అన్నదాతలు సంప్రదాయ పంచెకట్టుతో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.