TTD21st Oct 04:06 PMSunil Byrisetty1 min read
టీటీడీ ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు!
టీటీడీ ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. గడిచిన 11 నెలల్లో రికార్డుస్థాయిలో రూ.918.6 కోట్ల విరాళాలు అందాయి. ఆన్‌లైన్ ద్వారా రూ.579.38 కోట్ల విరాళాలు.. ఆఫ్‌లైన్ ద్వారా ర
టీటీడీ ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. గడిచిన 11 నెలల్లో రికార్డుస్థాయిలో రూ.918.6 కోట్ల విరాళాలు అందాయి. ఆన్‌లైన్ ద్వారా రూ.579.38 కోట్ల విరాళాలు.. ఆఫ్‌లైన్ ద్వారా రూ.339.20 కోట్ల విరాళాలు అందాయి. అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.338.8 కోట్ల విరాళాలు.. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.252.83 కోట్ల విరాళాలు దాతలు అందజేశారు. అలాగే ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.33.47 కోట్ల విరాళాలు.. బర్డ్ ట్రస్ట్‌కు రూ.30.02 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.20.46 కోట్ల విరాళాలు.. ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.13.87 కోట్ల విరాళాలు అందాయి. ఎస్వీబీసీకి రూ.6.29 కోట్ల విరాళాలు.. స్విమ్స్‌కు రూ.1.52 కోట్ల విరాళాలు దాతలు అందజేశారు.