News27th Jan 10:19 AMSunil Byrisetty1 min read

ఓ వైపు గజగజ.. మరోవైపు ప్రకృతి సోయగాలు!

మన్యంలో చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి మన్యం వ్యాప్తంగా రికార్డు స్థాయిలో క

ఓ వైపు గజగజ.. మరోవైపు ప్రకృతి సోయగాలు!
మన్యంలో చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి మన్యం వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. పాడేరులో ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడలేదు. పది అడుగుల దూరంలో ఉన్న వ్యక్తులు కూడా కనిపించనంతగా మంచు కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వెళ్లే వాహనాలు హెడ్‌లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో ప్రయాణించాల్సి వచ్చింది. అయితే వచ్చే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మన్యం వాసులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతమంతా దట్టమైన మంచు దుప్పటి కురుస్తోంది. మన్యం పరిసర ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడ్డాయి. పచ్చని చెట్లతో సహా ఆకాశమంతా పొగ మంచులో పర్యాటకులను కనువిందు చేస్తుంది.
Andhra Pradesh Weather
Cold Wave
Agency Areas
Manyam Region
Dense Fog
Low Temperatures
Winter Chill
Weather Alert
Nature Beauty
Scenic Views
Foggy Mornings
IMD Warning
Scroll for the next article