News26th Aug 03:15 PMSunil Byrisetty1 min read

7,730 మ‌ట్టి వినాయ‌కులతో రికార్డ్

వినాయక చవితి సందర్భంగా 'పర్యావరణ హిత గణేష్ చతుర్థి జరుపుకుందాం పర్యావరణాన్ని కాపాడుదాం' అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ మునిసిపల్ కార్పొర

7,730 మ‌ట్టి వినాయ‌కులతో రికార్డ్
వినాయక చవితి సందర్భంగా 'పర్యావరణ హిత గణేష్ చతుర్థి జరుపుకుందాం పర్యావరణాన్ని కాపాడుదాం' అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో మంగ‌ళ‌వారం ఎకో ఫ్రెండ్లి గణేశా కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ముఖ్యఅతిథులుగా హాజ‌రైన జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ జ్ఞాన్ చంద్, జాయింట్ కలెక్టర్ ఇలకియా, టి. డి. పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ ల‌తో పాటు ఇత‌ర అధికారులు మ‌ట్టి వినాయ‌కులను త‌యారు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో 7,730 ఎకో ఫ్రెండ్లీ వినాయ‌క విగ్ర‌హాలు త‌యారు చేయ‌టంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన‌ట్లు వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (డ‌బ్ల్యూబీఆర్‌-లండ‌న్‌) భార‌త ద‌క్షిణాది జాయింట్ సెక్ర‌ట‌రీ డా. యు.ఇలియాజ‌ర్ ప్ర‌క‌టించారు.
Andhra Pradesh
Ganesh Chaturthi
Eco-Friendly Ganesh
Clay Ganesh Idols
World Book of Records
Vijayawada
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
Scroll for the next article