Telangana12th Aug 11:08 AMSunil Byrisetty1 min read
పంద్రాగస్టు సందర్భంగా రెడ్ అలర్ట్!
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ విధించారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో విమానాశ్రయంలో అధికారులు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విమానాశ్రయం
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ విధించారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో విమానాశ్రయంలో అధికారులు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు.
విమానాశ్రయం వద్ద అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది సూచనలు చేశారు.