International21st Jan 11:31 AMSunil Byrisetty1 min read
తాటి చెట్టంత ఎత్తు అలలు.. వణుకుతున్న ఇటలీ
దక్షిణ ఇటలీని హ్యారీ తుపాను అతలాకుతలం చేస్తోంది. తాటి చెట్టంత ఎత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని వణికిస్తున్నాయి. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రక
దక్షిణ ఇటలీని హ్యారీ తుపాను అతలాకుతలం చేస్తోంది. తాటి చెట్టంత ఎత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని వణికిస్తున్నాయి. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 120 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు, 9 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలల వల్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరుతోంది. సహాయక బృందాలు తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నేటితో తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరంలోని చాలా ప్రాంతాలు తుఫాన్ అలల ధాటికి చిగురుటాకులా కంపిస్తున్నాయి.