News27th Nov 01:23 PMSunil Byrisetty1 min read

ఎర్రచందనం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్టు

తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచర

ఎర్రచందనం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్టు
తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో టీమ్ రేణిగుంట మండలం మామండూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవులపెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో వేటుకగా ఆ ప్రాంతంలో దాచి ఉన్న 20ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు. అరెస్టయిన వారితో పాటు ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వి శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Andhra Pradesh news
Red sandalwood smuggling
Tirupati district
Task Force police
Forest crime
Mamandur operation
Smugglers arrested
Red sandalwood seizure
Crime news
Police investigation
Scroll for the next article