News16th Nov 06:04 PMSunil Byrisetty1 min read
పవన్ ఆదేశాలతో ఎర్రచందనంపై ఉక్కుపాదం!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 24ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఉపముఖ్యమంత్రి పవ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 24ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం ఆదవరం బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టింది. ఆదివారం ఉదయం సదాశివకోన ప్రాంతం చేరుకునే సరికి, కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలను పడేసి పారిపోసాగారు. పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకో గలిగారు. వారిని తమళనాడులోని కల్లకురిచ్చి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో పడి ఉన్న 15ఎర్రచందనం దుంగలను తీసుకుని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు.