News23rd May 10:56 AMSunil Byrisetty1 min read

మళ్లీ జిల్లాల పునర్విభజన?

ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలను తమ పరిధిలోకి తీసుకురావాలని అన్నమయ్య జిల్లా కల

మళ్లీ జిల్లాల పునర్విభజన?
ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలను తమ పరిధిలోకి తీసుకురావాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలమనేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌ పరిధిలోనికి తీసుకురావడంపై ప్రజలు అభ్యంతరాలు, సలహాలు 30 రోజుల్లోగా తెలియజేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన వినతులనూ పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో, నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి
Andhra Pradesh
TDP
Re-division of districts
జిల్లాల పునర్విభజన
ఆయా జిల్లాల కలెక్టర్లతో నేతలతో చర్చించి నిర్ణయం
Scroll for the next article