Mobiles30th Nov 11:30 AMSunil Byrisetty1 min read
రెడ్మీ నుంచి బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్
రెడ్మీ నుంచి కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi 15C 5G త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార
రెడ్మీ నుంచి కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi 15C 5G త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 12,499 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ , 50MP మెయిన్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అదేవిధంగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే మూడు వేరియంట్స్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని కూడా లీకుల ద్వారా అర్ధం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర సుమారు రూ. 12,499 లుగా, అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర సుమారు రూ. 13,999 లుగా, చివరగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర సుమారు రూ. 14,999 లుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.