Health7th Apr 07:18 PMSunil Byrisetty1 min read
నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల నూనె.. చంద్రబాబు సూచన!
సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్లే చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. చాలా వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నలుగు
సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్లే చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు.
చాలా వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే వాడాలని సూచించారు.
వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలన్నారు.
రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీల వాడితే సరిపోతుందని సూచించారు.
ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రణ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.
రోజూ కనీసం ఒక్క అరగంట పాటు తేలిక పాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆహారం ఔషదం, వంటగదే ఔషధశాల అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాననని చంద్రబాబు చెప్పారు.