News19th Jul 05:19 PMSunil Byrisetty1 min read
రీల్స్ పిచ్చి.. జలపాతంలో ఏపీ విద్యార్థులు!
రీల్స్ పిచ్చి కొంపలు ముంచుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా రీల్స్ మాయలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కర్ణాటకలోని మల్లల్లి జలపాతం చూసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులల
రీల్స్ పిచ్చి కొంపలు ముంచుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా రీల్స్ మాయలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కర్ణాటకలోని మల్లల్లి జలపాతం చూసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులలో ఇద్దరు ఇలా రీల్స్ కోసం జలపాతం మధ్యలో చిక్కుకుని పోయారు. ఆ ఇద్దరు రీల్స్ పిచ్చిలో అతిగా ప్రవర్తించి నిషేధిత ప్రదేశంలోకి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడటంతో చిక్కుకున్నారు. విద్యార్థులు గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో బతికి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో ఇద్దర్ని ప్రాణాలను కాపాడారు. అప్పటి వరకు నీటి ప్రవాహం మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. అందుకే ఏదీ అతిగా ఉండకూడదని, రీల్స్ కోసం రిస్కులు చేయొద్దని సూచిస్తున్నారు.