News9th Apr 04:05 PMSunil Byrisetty1 min read

ఏపీకి రూ. 80 వేల కోట్లతో రిఫైనరీ

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 80 వేల కోట్లతో భారీ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ.. అవక

ఏపీకి రూ. 80 వేల కోట్లతో రిఫైనరీ
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 80 వేల కోట్లతో భారీ రిఫైనరీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ.. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని వెల్లడించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమన్నారు. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
Andhra Pradesh
Hardeep Singh puri
Indian Oil
Corporation
Refinery
80 వేల కోట్లతో భారీ రిఫైనరీని
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి
Scroll for the next article