News24th Nov 05:30 PMSunil Byrisetty1 min read
మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు
నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలని చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి నన్ను పిలిచి సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్
నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలని చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి నన్ను పిలిచి సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారన్నారు. అందుకోసమే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంకుతో నియమించారని చెప్పారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నైతికవిలువలపై రాష్ట్రస్థాయి విద్యా సదస్సు లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. చాగంటి ద్వారా నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి మీ భవిష్యత్తు కోసం అందిస్తున్నామని వివరించారు. మట్టి కుండలా మారుతుందని, శిల శిల్పంలా తయారవుతుందని పేర్కొన్నారు. బడిలో పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చితే సమాజంలో ఆశిస్తున్న మార్పును సాధించగలుగుతామని వివరించారు. అణుశక్తి ని బాంబులా వాడటం వల్ల హిరోషిమా, నాగసాకీ నగరాల్లో ఎంత వినాశనం జరిగిందో అందరం చూశామని, అదే అణుశక్తిని విద్యుత్ తయారీకి వాడితే దేశానికి వెలుగు, అభివృద్ధి లభిస్తుందని వ్యాఖ్యానించారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైనా ఉందని లోకేష్ పేర్కొన్నారు.