News25th Jul 09:52 AMSunil Byrisetty1 min read
ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్‌గా ప్రకాశం
రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి
రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సీబీజీ ప్లాంట్లు నిర్మాణాలు - ప్రాజెక్టులకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. సీబీజీ ప్లాంట్లతో రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, ప్లాంట్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. "ప్రకాశం జిల్లాలోని వాయుమడుగు, పీసీ పల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లను 26 మార్చి 2026 నాటికి ప్రారంభించాలి. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల నిర్మాణంపై ప్రతీ 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తాం. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15 వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేలు కౌలు చెల్లింపు జరుగుతుంది." అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.