News15th Dec 01:28 PMSunil Byrisetty1 min read

రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్స్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో ప్లాన్లను ప్రకటించింది. నెలవారీ, వార్షిక, డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఈ అన్ని ప్లాన్లతోనూ గూ

రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్స్
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో ప్లాన్లను ప్రకటించింది. నెలవారీ, వార్షిక, డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఈ అన్ని ప్లాన్లతోనూ గూగుల్ జెమిని ప్రో ఏఐ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది. అలాగే 'హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్' ధర రూ.500గా ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా, అపరిమిత 5G యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాఠీ, ఫ్యాన్‌కోడ్ వంటి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా రూ.35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. వార్షిక ప్లాన్ ధరను రూ.3,599గా నిర్ణయించారు. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటా, అపరిమిత 5G డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు కూడా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుంది.
Telecom News India
Reliance Jio
Jio New Year Offers 2026
Jio Prepaid Plans
Jio 5G
Google Gemini Pro
Free AI Subscription
Unlimited 5G Data
Jio OTT Benefits
Lionsgate Play
Discovery Plus
Sun NXT
FanCode
Scroll for the next article