News31st Jul 12:51 PMSunil Byrisetty1 min read

ఏలూరుకు రిలయన్స్.. భారీ పెట్టుబడి!

ఏపీకి ప్రముఖ దిగ్గజ సంస్థలు తరలి వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని బొగ్గు బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడిత

ఏలూరుకు రిలయన్స్.. భారీ పెట్టుబడి!
ఏపీకి ప్రముఖ దిగ్గజ సంస్థలు తరలి వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని బొగ్గు బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టును నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దేశంలో తొలి భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును రిలయన్స్ అభివృద్ధి చేయబోతోంది. చింతలపూడి ప్రాంతంలో ఉన్న భారీ బొగ్గు నిల్వలను వినియోగించుకుంటూ పర్యావరణహిత సాంకేతికతతో ఇంధనాన్ని ఉత్పత్తి చేయనుంది. 2029 నాటికి ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో భారీగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Andhra Pradesh
Eluru
Reliance Industries
Chintalapudi
Coal Gasification
Underground Coal Gasification
Energy Project
భారీ పెట్టుబడి
ఇంధన ప్రాజెక్టు
ఉపాధి అవకాశాలు
పారిశ్రామిక అభివృద్ధి
Scroll for the next article