News16th Jul 04:58 PMSunil Byrisetty1 min read

ఇన్నాళ్లకు వరుణుడి కరుణ!

వర్షాకాలం మొదలైనా ఎండలు విరగకాస్తున్నాయి. చాలాచోట్ల 40కిపైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఏపీలో మూడు

ఇన్నాళ్లకు వరుణుడి కరుణ!
వర్షాకాలం మొదలైనా ఎండలు విరగకాస్తున్నాయి. చాలాచోట్ల 40కిపైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం వడగాల్పులు కొనసాగుతాయని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది.
Andhra Pradesh Weather
Rain Forecast
Low Pressure
Bay of Bengal
IMD
Monsoon
తెలంగాణ వాతావరణం
బంగాళాఖాతం
భారీ వర్షాలు
వడగాల్పులు
హైదరాబాద్
Scroll for the next article