News17th Sep 02:29 PMSunil Byrisetty1 min read
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట
రాజధాని నిర్మాణం కోసం గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రిటర్నబుల్ ప్లాట్‌లలో "అసైన్డ్" అని పేర్కొనడంతో వాటి అమ్మకా
రాజధాని నిర్మాణం కోసం గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రిటర్నబుల్ ప్లాట్‌లలో "అసైన్డ్" అని పేర్కొనడంతో వాటి అమ్మకాలు జరగడం లేదని రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీఎం సూచనల మేరకు అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్‌లలో ఇకపై "అసైన్డ్" అనే పదం లేకుండా "పట్టా భూమి"గా పేర్కొనాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లో కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్‌ను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 187 విడుదల చేశారు.