Telangana1st Sep 04:09 PMSunil Byrisetty1 min read
హైడ్రా కమిషనర్ కు హైకోర్టులో ఊరట
హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కోర్టు ఆదేశాలను తరచూ రంగనాధ్ ఉల్లంఘిస్తున్నారని, ఆయన్ను హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కోర్టు ఆదేశాలను తరచూ రంగనాధ్ ఉల్లంఘిస్తున్నారని, ఆయన్ను హైడ్రా కమిషనర్ గా తొలగించాలని సింగిల్ బెంచ్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. తాజాగా విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆర్డర్ ను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ ను నవంబర్ 3కు వాయిదా వేసింది.