News3rd Sep 03:05 PMSunil Byrisetty1 min read
ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఊరట
గత ప్రభుత్వంలో ముంబై నటి జెత్వానీని నిర్బంధించారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా ట
గత ప్రభుత్వంలో ముంబై నటి జెత్వానీని నిర్బంధించారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా , విశాల్ గున్నిలపై సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే సర్వీసులోకి పునరుద్ధరిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తూ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా విధించిన సస్పెన్షన్ గడువు సెప్టెంబర్ 4తో ముగియనున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత ప్రక్రియకు సంబంధించి డీజీపీ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. న్యాయ, పాలనాపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం, సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.