News3rd Nov 12:56 PMSunil Byrisetty1 min read

రాష్ట్రమంతా సహాయక చర్యలు!

మురసు తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల భద్రత, రాకపోకల పునరుద్ధరణకు ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో సహాయకp చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆర్‌ & బీ శాఖమంత్రి బీసీ జనార్

రాష్ట్రమంతా సహాయక చర్యలు!
మురసు తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల భద్రత, రాకపోకల పునరుద్ధరణకు ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో సహాయకp చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆర్‌ & బీ శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు, జాతీయ రహదారుల పరిధిలో కలిపి మొత్తం 30 కంట్రోల్ రూమ్ లు , సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 40 మంది సమన్వయ అధికారులను నియమించామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో 8 సమావేశాలు నిర్వహించి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నామని చెప్పారు. తుఫాన్‌ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 178 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 471 జేసీబీలు, 421 విద్యుత్ రంపపు యంత్రాలతో అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
Scroll for the next article