Politics18th Sep 12:17 PMSunil Byrisetty1 min read

మతం మారితేనే వైసీపీలో పదవులా?

వైసీపీలో ఒకప్పుడు నంబర్-2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్‌ను నేరుగా టార్గెట్ చేశారు. జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అత్యంత సున్నితమైన, వివాదాస్పద అస్త

మతం మారితేనే వైసీపీలో పదవులా?
వైసీపీలో ఒకప్పుడు నంబర్-2గా చక్రం తిప్పిన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఇప్పుడు అదే జగన్‌ను నేరుగా టార్గెట్ చేశారు. జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అత్యంత సున్నితమైన, వివాదాస్పద అస్త్రాన్ని బయటకు తీశారు. కేవలం సాధారణ రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా, నేరుగా మత మార్పిళ్లు అనే సెన్సేషనల్ పాయింట్‌ను తెరపైకి తెచ్చి జగన్ విధానాలను నిలదీయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మత మార్పిడి కార్యక్రమాలు పెద్దఎత్తున వ్యూహాత్మకంగా సాగాయనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి నేతలు బహిరంగ సభల్లోనే పాస్టర్లను వెనుకేసుకురావడం, క్రైస్తవ ముఖ్యమంత్రి మళ్లీ రావాలంటూ ప్రార్థనలు చేయించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా బాప్టిజం ఘాట్ల నిర్మాణాలు చేపట్టడం, స్థానికులు కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు ఇప్పటికీ ప్రజల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో , పార్టీ అధికార పత్రిక సాక్షి వేదికగా కూడా మేధావులతో ప్రత్యేక వ్యాసాలు రాయించి మత మార్పిళ్లకు ఒక సిద్ధాంత రూపం కూడా తీసుకువచ్చారనే చర్చ నడుస్తోంది.
Scroll for the next article