News12th Nov 09:52 AMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో మరో 2 భారీ ప్రాజెక్టులకు రెన్యూ ఒప్పందం

రెన్యూ ఛైర్మన్ & సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రెన్యూ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగ

రాష్ట్రంలో మరో 2 భారీ ప్రాజెక్టులకు రెన్యూ ఒప్పందం
రెన్యూ ఛైర్మన్ & సీఈవో సుమంత్ సిన్హాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రెన్యూ సంస్థ రాష్ట్రంలో పలుచోట్ల రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడంపై అభినందనలు తెలిపారు. మంత్రి లోకేష్ తో చర్చల అనంతరం మరో రెండు భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమంత్ సిన్హా సుముఖత వ్యక్తంచేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెన్యూ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 2గిగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులో రూ.12,500 కోట్లు, గ్రీన్ అమ్మోనియా/ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టులో రూ.17,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ... మరో రూ.11వేల కోట్ల విలువైన పాలి సిలికాన్, మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్ ప్రాజెక్టు సైతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినందుకు అభినందనలు తెలియజేస్తూ.. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను ఏపీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
Scroll for the next article