Spiritual16th Aug 09:16 AMSunil Byrisetty1 min read
దేవుని కడపలో జీర్ణోద్ధరణ
కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం నిలి
కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం నిలిపివేయనున్నారు. ఆలయంలో జీర్ణోద్ధరణ పనుల నేపద్యంలో అంతరాలయ దర్శనం బంద్ కానుంది.
దాదాపు 6 నెలల పాటు ఆలయంలోని బాలాలయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బాలాలయాన్ని అధికారులు నిర్మిస్తున్నారు. 18, 19 తేదీల్లో టీటీడీ అర్చకులచే హోమాల నిర్వహణ చేపట్టనున్నారు. 19 నుండి బాలాలయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు, భక్తులకు దర్శనం కల్పిస్తారు.