Telangana10th Nov 02:36 PMSunil Byrisetty1 min read
ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల స
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించి చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించింది. అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.