News13th Jan 02:46 PMSunil Byrisetty1 min read

సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో అమ్మవారి ప్రతిరూప ఆలయం

న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో కొలువైన కనకదుర్గమ్మ వారి ప్రతిరూప ఆలయంలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చ

సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో అమ్మవారి ప్రతిరూప ఆలయం
న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో కొలువైన కనకదుర్గమ్మ వారి ప్రతిరూప ఆలయంలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి అలంకరణ పనులను దుర్గగుడి సూపరింటెండెంట్ జగదీష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వారి తరహాలోనే, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న ఈ ప్రతిరూప ఆలయంలో కూడా అదే సంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి వేడుకల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Sankranti celebrations
AP Bhavan Delhi
Kanaka Durga replica temple
Goddess Durga
temple decorations
religious rituals
జగదీష్
పూజా కార్యక్రమాలు
భక్తుల సౌకర్యాలు
Scroll for the next article