News2nd Nov 11:40 AMSunil Byrisetty1 min read
5 జిల్లాల్లో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
5 జిల్లాల్లోని 7 పట్టణ స్థానిక సంస్థల్లో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ర
5 జిల్లాల్లోని 7 పట్టణ స్థానిక సంస్థల్లో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండో సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఐదు జిల్లాల్లోని ఏడు పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 12 వార్డుల్లోని 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. రీపోలింగ్ నవంబర్ 2, 2026న (సోమవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. సంబంధిత ప్రాంతాల ఓటర్లు నిర్ణీత సమయానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సూచించారు.