Health8th Apr 12:13 PMNelluri Viswanath1 min read
ఏపీకి బీపీ.. డయాబెటిస్ కూడా..!
మన రాష్ట్రంలో లక్షల మంది బీపీ, డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏపీ ప్రజల ఆరోగ్య సమస్యలపై నివేదిక విడుదలైంది. రాష్ట్రంలో 11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. 8,
మన రాష్ట్రంలో లక్షల మంది బీపీ, డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఏపీ ప్రజల ఆరోగ్య సమస్యలపై నివేదిక విడుదలైంది. రాష్ట్రంలో 11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది.
8,37,927 మంది మగవాళ్లకు హైపర్ టెన్షన్ ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువుగా ఉంది.
శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నాయి.
మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్ ఉంది.
అండర్ ఫాలో అప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64%) ఉన్నారు. 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు, 1,19,397 మంది క్యాన్సర్ రోగులు, 30,646 మంది కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
ఏపీలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.