News19th Sep 12:25 PMSunil Byrisetty1 min read
సీప్లేన్ సేవలపై పెట్టుబడులకు ఆసక్తి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని 32 ప్రాంతాల నుంచి సీప్లేన్ సేవలు అందించేందుకు దిల్లీకి చెందిన మెహెయిర్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలోని 32 ప్రాంతాల నుంచి సీప్లేన్ సేవలు అందించేందుకు దిల్లీకి చెందిన మెహెయిర్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలు అందించారు. మంత్రి మాట్లాడుతూ.. "సంస్థ పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తాం. సీప్లేన్ సర్వీసులతో పర్యా టకరంగం అభివృద్ధి చెందుతుంది. మారుమూల ప్రాంతాలతో అనుసంధా నమూ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు వస్తాయి' అని పేర్కొన్నారు.