News30th Oct 10:43 AMSunil Byrisetty1 min read
తుపానుతో మునిగిన ప్రాంతంలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్
మొంథా తుపాను ప్రభావంతో నీట మునిగిన ప్రాంతంలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారు. పర్చూరు ప్రాంతంలో పొంగిప
మొంథా తుపాను ప్రభావంతో నీట మునిగిన ప్రాంతంలో సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారు. పర్చూరు ప్రాంతంలో పొంగిపొర్లుతున్న వాగు నుంచి 15 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. వరద నీటి ప్రవాహంలో చిక్కుకు పోయిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారీ వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్ధనా మందిరం నుంచి 15 మందిని రక్షించారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పర్చూరు వాగుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుకుంది. చిలకలూరిపేట, యుద్ధనపూడి, మార్టూరులలో కురిసిన వర్షాలకు పర్చూరు వాగుకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ఈ వరద నీరు గ్రామాలను ముంచెత్తకుండా నీటిని ఉప్పుటూరు కాలువకు అధికారులు మళ్లించారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని గ్రామాలకు వరద ముంపు తప్పింది.