News11th Sep 11:36 AMSunil Byrisetty1 min read

సమయపాలన లేని సచివాలయ సిబ్బంది

గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సచి

సమయపాలన లేని సచివాలయ సిబ్బంది
గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయాలు తెరిచి ఉండాలి. కానీ మంగళగిరి నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు 10:30, 11 గంటలకు వస్తున్నారని, మధ్యాహ్నమే వెళ్లిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నగరం లోని మార్కండేయ కాలనీ లోని 17 వ నంబర్ సచివాలయం సిబ్బంది ఉదయం 10:45 కు కూడా కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు సచివాలయం ఎదుటే పడిగాపులు కాస్తున్నారు. రేషన్ కార్డు, ఆధార్, పెన్షన్ పనుల కోసం వచ్చే వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. 17 వ సచివాలయం తలుపులు మూసి ఉండటంతో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వృద్ధులు కార్యాలయం ఎదుట అధికారుల రాక కోసం వేచి చూస్తున్నారు. ఆయా సచివాలయాల్లో కొంతమంది సిబ్బంది ప్రతిరోజు హాజరు రిజిస్టర్ లో సంతకం పెట్టి బయటకు వెళ్లిపోతున్నారని, బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh
Mangalagiri
Ward Secretariat
Village Secretariat
Secretariat Staff
Staff Attendance
Markandeya Colony
Secretariat No 17
రేషన్ కార్డు
ఆధార్ సేవలు
బయోమెట్రిక్ హాజరు
ప్రజా సేవలు
మంగళగిరి వార్తలు
Scroll for the next article