News6th Nov 11:12 AMSunil Byrisetty1 min read

కొటియా ప్రాంత సమస్యలు పరిష్కరించాలి

పార్వతీపురం జిల్లా కొటియా ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వం నిర్లక్ష్యం వలన తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలలో పాల్గొనవద్దని ఒడిశా

కొటియా ప్రాంత సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం జిల్లా కొటియా ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వం నిర్లక్ష్యం వలన తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలలో పాల్గొనవద్దని ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ సరుకులు పంపిణీ జరగకుండా అడ్డుకుంటున్నదని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో తెలిపారు. మైనింగ్ కోసం ఆ గ్రామాల ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో కోటియా గ్రామాల ప్రజలు పాల్గొన వద్దని గడిచిన వారం రోజులుగా ప్రతి గ్రామానికి ఒడిస్సా పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి నిర్బంధించారని వివరించారు. ఈ నిర్బంధాలను అధిగమించి పోలింగ్ ముందురోజు రాత్రి గ్రామాలు ఖాళీ చేసి, వేరే గ్రామాలకు బంధువుల ఇళ్ల వద్దకు రాత్రి చేరుకుని ఈ ఉదయం ఓటు వేసి తర్వాత స్వగ్రామాలకు చేరుకుంటున్నారని తెలిపారు. కావున మన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల అభీష్టానికనుగుణంగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Scroll for the next article