News5th Sep 04:18 PMSunil Byrisetty1 min read
రైతుల సమక్షంలోనే రీసర్వే
భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెట
భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే కార్యక్రమాన్ని ఆయన జిల్లా రెవిన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే జరగడంతో అయన హర్షం వ్యక్తం చేశారు. రీసర్వే లో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టేరోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబసభ్యులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలన్నారు. రైతు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకూ సమాచారం తప్పనిసరిగా అందించేలా చూడాలని ఆదేశించారు.