News18th Oct 03:33 PMSunil Byrisetty1 min read

విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీవీ

విజయవాడ మేయర్ అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పని చేసిన ఏబీవీ గత వైసీపీ ప్రభుత్వంలో విచారణ ఎ

విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీవీ
విజయవాడ మేయర్ అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పని చేసిన ఏబీవీ గత వైసీపీ ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు రెండేళ్లకుపైగా పోస్టింగ్ లేకుండా, రిటైర్మెంట్ ముందు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ డీజీగా నియమితులై, పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విజిల్ బ్లోయర్ గా పని చేస్తూ వస్తున్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలిపి, ఆ పార్టీల నుంచి అభ్యర్థులను నిలబెట్టలేదు.
Scroll for the next article