News8th Apr 09:17 AMSunil Byrisetty1 min read

ఏడడుగుల కండక్టర్ కష్టాన్ని తీర్చిన సీఎం

హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట దగ్గరలో వున్న షాహీ నగర్‌లో నివాసం ఉండే అహ్మద్ అన్సారీ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. మెహదిపట్నం ఆర్టీసీ డిపోలో పని చేసే అన్సారీ ఏడడుగుల పొడవు ఉం

ఏడడుగుల కండక్టర్ కష్టాన్ని తీర్చిన సీఎం
హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట దగ్గరలో వున్న షాహీ నగర్‌లో నివాసం ఉండే అహ్మద్ అన్సారీ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. మెహదిపట్నం ఆర్టీసీ డిపోలో పని చేసే అన్సారీ ఏడడుగుల పొడవు ఉండటంతో బస్సులో వంగి విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం కండక్టర్ అహ్మద్ అన్సారీ కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది! ఆర్టీసీ బస్సు టాప్ 6.4 అంగుళాలు ఉండగా.. అన్సారీ ఏడడుగులతో తల ఒక వైపుకు వంచి విధులు నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. రేవంత్ రెడ్డి స్పందించి, మెడ వంచి ఎన్నాళ్ళు కష్టం పడతారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. ఆయన ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో మాట్లాడారు. వెంటనే అతన్ని ఆర్టీసీలోనే వేరే విభాగానికి బదిలీ చేయనున్నట్లు సజ్జనార్ తెలిపారు.
Tall Man Working as a bus Conductor
CM Revant Reddy
Telangana
పొడవైన కండక్టర్​ ఇబ్బందులు
ఆర్టీసీలో కండక్టర్
Scroll for the next article