News8th Oct 02:40 PMSunil Byrisetty1 min read
దసరా, ఉత్సవ్ 2.0కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం
విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొని నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చ
విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు.
విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొని నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఆస్వాదించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీలు కోరారు.
శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందేందుకు విజయవాడకు రావాలని తెలంగాణ సీఎంకు ఆహ్వానించారు.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులను విజయవాడ దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఎంపీలు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణ చేస్తున్నట్లు టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, సతీష్ తెలిపారు.