Telangana28th Sep 03:25 PMSunil Byrisetty1 min read
పదేళ్లలో ప్యూచర్ సిటీ నిర్మిస్తా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ అధారిటీ భవనానికి, ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ అధారిటీ భవనానికి, ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ మీద కొంత మంది అనవసర విమర్శలు చేస్తున్నారని.. పదేళ్ల సమయం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు. తనకు భూములు ఉన్నాయని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నానని, రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నానని అంటున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ఆర్, చంద్రబాబు విమర్శలను పట్టించుకుని ఉంటే ఈనాడు హైటెక్ సిటీ , సైబరాబాద్ ఉండేవి కాదన్నారు. వారు ఆలోచన చేశారు కాబట్టే నేడు ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు. ఇంకెన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు. భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అందుకే మచిలీపట్నం నుంచి పన్నెండు వరుసల రహదారిని ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే అమరావతికి అనసంధానించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుందని తెలిపారు.