Telangana28th Jul 05:21 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఇచ్చాక తెలంగాణలో అడగండన్న సీఎం
తెలంగాణలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని, తాను కూడా ఇవ్వనని వ్యాఖ్యానించారు. ఫీజ్ రీయింబర్స్
తెలంగాణలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పై ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని, తాను కూడా ఇవ్వనని వ్యాఖ్యానించారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణితో మాట్లాడారు. ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అని, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వమని అడగాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ఉందని చెప్పారు. ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.