Politics1st Aug 02:47 PMSunil Byrisetty1 min read

బాబుకు రేవంత్ గురుదక్షిణ!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యాననించారు. ఏపీ మంత్రి న

బాబుకు రేవంత్ గురుదక్షిణ!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యాననించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కట్టి తీరుతామని అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. వాళ్ళు బనకచర్ల కడుతాము అంటేనేగా మేము అడ్డు చెప్పేదని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ లోకేష్ మాత్రం తాము కట్టే తీరుతామని అంటున్నారని, దీనిపై స్పందించరా అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే రేవంత్ తన గురువు బాబుకు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని అర్థం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు.
AP Politics
Telangana Politics
Chandrababu Naidu
Revanth Reddy
Harish Rao
Nara Lokesh
BRS
Congress
Banakacharla Project
Political Allegations
Guru Dakshina
చంద్రబాబు
రేవంత్‌రెడ్డి
Scroll for the next article